Monday 28 February 2011

స్వేచ్చాఅక్షాంకలు

అరబ్ ప్రపంచంలో మధ్య కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు అక్కడి పాలకుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తుస్తున్నాయనడంలో సందేహం లేదు. నిన్న ఈజిప్టులో ముబారక్ తొలగింపు, నేడు లిబియాలో గడాఫి తొలగింపు కొరకు విస్త్రత స్దాయిలో సాగుతున్న ప్రజాందోళనలు, రేపు మిగతా అరబ్ దేశములో మొదలవుతుందోన్న అందోళనలో అరబ్ దేశాధినేతలు బెంగపడుతున్నారు. వాస్తవానికి చెప్పాలంటే, నేటి అధునిక కాలములో ప్రజల ద్వారా ఎన్నుకొనబడి ప్రజాసామ్యదేశంగా ఉన్న దేశాలు చాలానే ఉన్నాయి. నేటి ప్రజలలో వచ్చిన మార్పు మరియు జాతుల మధ్య తగ్గిన అసమానతలు అన్ని రకాల ప్రజలకు సమాన న్యాయమును పాటిస్తున్నాయి. మార్పు రెండవ ప్రపంచ యుద్దం తర్వాత బాగా వృద్ది చెందింది. కాని విచిత్రంగా మధ్యప్రాచ్యంలో ఉన్న అరబ్ దేశాలన్నింటిలోను మరియు కొన్ని యితర దేశాలలో ఇంకా రాజులు లేక నియంతల పాలనలోనే ఏలుబడి సాగుతుండడం నిజంగా ఆశ్చర్యకరమే. ప్రజాస్వామ్యం దిశగా అమెరికా, ఇండియా, జపాన్, బ్రిటన్ మె.గు దేశాలు ఏనాడో అధికారమును ప్రజలకు అప్పగించాయి. ఐక్యరాజ్యసమితి ఏర్పాటయిన తర్వాత సభ్యత్వం ఉన్న దేశాలన్నింటా ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకొని ఉంటే బాగుండేది. నేటి ప్రపంచం అధునిక పోకడలతో ముందుకు పోతుందని, మనము సాధించిన విజయములు ద్వారా అసంఖ్యాకులు నమ్ముతున్నారు. కాని ఇది నాణేనికి ఒక వైపు మాత్రమేనని మిగతా కొన్ని దేశాలను గమనిస్తే తెలుస్తుంది.  ఆయా దేశములలో నేటికి కూడా ప్రజలకు ప్రాధమిక హక్కులు లేకపోవడం చాలా దుర్లభం. మారుతున్న ప్రపంచంలో అందుబాటులో ఉన్న సాంకేతిక మరియు శక్తివంతమైన మీడియా ద్వారా  ప్రపంచ విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకొనుటకు వీలుపడడంతో ఆయా దేశాలలో ప్రజలకు ప్రజాస్వామ్యం పట్ల మక్కువ ఏర్పరచుకొని నియంతల పాలనకు చరమగీతం పాడడానికి కదం తొక్కుతున్నారు. ఇప్పటి వరకు ఏకచత్రాదిపత్యముగా పాలించిన నియంత రాజులకు చర్యలు సహజంగానే మింగుడుపడనివి. కాని నేటు అధునిక కాలములో ప్రజలలో వస్తున్న మార్పులు గౌరవించి, ఆయా దేశాలు ప్రజాస్వామ్యం దిశగా చర్యలు తీసుకుంటే మంచిది. ఇప్పటికే విషయములో ప్రజల నుండి ఇంకా ఆలోచన రాకముందే భూటాన్ రాజు అక్కడి తన రాజ్యపాలనను రద్దుచేసి ప్రజాస్వామ్యమును ఏర్పాటు చేసి, ప్రజల మనసులో చిరస్దాయిని సంపాదించుకొన్నాడు. కాబట్టి నేటికైనా అరబ్బు పాలకులు భ్రమలు వీడి, ప్రజాపాలనకు తగు చర్యలు తీసుకొవలసిన సమయం ఆసన్నమయింది. కాని పక్షంలో ముబారక్ కి పట్టిన గతే వీరికి పట్టవచ్చు.

Thursday 24 February 2011

అందగాళ్ళు-పనిగాళ్ళు

వాస్తవిక ప్రపంచంలో అందంమునకు, పనితనమునకు గల విలువను వెలకట్టలేనిది. ఇది అనాది గా ఎప్పటి నుండో వస్తున్నది. ముఖ్యంగా రూపురేఖలలో బాగుండేవారు అవలీలముగా ఇతరులను వెంటనే అకర్షిస్తారు. ఇప్పటి గ్లామర్ ప్రపంచంలో దానికి ఉన్న ప్రాముఖ్యత ఇంకా పెరిగిపోయింది.   అందుకే కొన్ని సంస్దలలో ఉద్యోగాల తీసుకొనే సమయములో రూపురేఖలకు ప్రధమ ప్రాధ్యాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా సాప్ట్ వేర్, అతిధ్య రంగం, మీడియా రంగం, విమానయాన రంగం మొ.గు సంస్దలలో అందానికి ముఖ్య ప్రాధ్యానత ఇస్తున్నారు. ఇక సినిమా రంగం, మోడలింగ్ రంగాల గురించి ఆయితే చెప్పనవసరం లేదు.
          ఇకపోతే ఇప్పుడు చెప్పుకోవలసినది పనిగాళ్ళు గురించి.  పురాతన కాలము నుండి పని సామర్ద్యం ఉన్నవాళ్ళకి ఉన్న డిమాండ్ గురించి చెప్పనవసరం లేదు. ఎవరి దగ్గరైన ఏదొక రంగంలో లేక కొన్ని రంగాలలో నైపుణ్యం ఉంటే, వారు ఎక్కడున్న సరే అవకాశాలు వెతుక్కుంటు వస్తాయి. ప్రపంచ చరిత్రను తరచి చూస్తే అటువంటి వారిని గమనించవచ్చు. ప్రస్తుత పోటి ప్రపంచంలో పని నైపుణ్యం ఉన్నవారి విలువ ఆయా సంస్దలకు ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకని అయా సంస్దలు ఒక పని నిపుణుడి కోసం ఎంతకైనా ఖర్చు చేయడానికి వెనుకాడవు.
          పైన చెప్పిన విధముగా చూస్తే, ప్రస్తుతం అందంను, పని సామర్ద్యం నకు ఉన్న ఫాలోయింగ్ తెలుస్తుంది. ప్రస్తుతం నేను చెప్పేదేమిటంటే, పైన తెలిపిన రెండు రకముల మనుషులు ఉండడం సహజం. కాని పైన చెప్పిన రెండు లక్షణాలు కల్గిన వ్యక్తులు ఇంకా గొప్ప క్రింద లెక్క. అలాంటి వ్యక్తులు నాకు తారసపడ్డారు. నమ్మలేకున్నారా???? నాకు తెలుసు... మీరు నమ్మరని...... కాని ఇది నిజం......... నా ఎరుకలో పైన చెప్పిన "అందగాళ్ళు-పనిగాళ్ళు" ఉన్నారు..... వారే మిస్టర్ నాగవోలు మూర్తి మరియు మిస్టర్ మురళికృష్ణ(సార్దకనామదేయుడు) గార్లు...... వీరు బాపు-రమణ అంతటివాళ్ళు.......  అప్పుడేప్పుడొ కమలహసన్ సినిమాలో సూపర్ హిట్ సాంగ్ "అటగాళ్ళు, పాటగాళ్ళు, అందగాళ్ళు,........... అంటు సాగే సాంగ్... ఇప్పుడు మా వాళ్ళిద్దరికి సరిపోతుంది..... " అందగాళ్ళు.... పనిగాళ్ళు..........మాటగాళ్ళు...... మంచివాళ్ళు..........."

నా ప్రియతమ స్నేహితుల మీద అభిమానంతో సరదాగా రాసిన అర్టికల్...... ఎవరినైనా నొప్పించిన యెడల క్షమించవలసినదిగా కోరుకుంటు............

Wednesday 23 February 2011

పడిలేచిన సింహం

ప్రపంచ క్రికెట్ లో పాకిస్తాన్ క్రికెట్ కొంత ప్రత్యేకం. ఎందుకంటే అత్యుత్తమ స్దాయి ఆటగాళ్ళు పాకిస్తాన్ క్రికిట్ లో లెక్కకిమిక్కిలిగా కనబడతారు. ప్రతిభ పరంగా చూస్తే అద్బుతమైన ఆటగాళ్ళు ఎంతో మంది కలిగిన చరిత్ర పాకిస్తాన్ క్రికెట్ సొంతం. కాని పాకిస్తాని క్రికెట్ లో తలెత్తె అనిశ్చితి ఎప్పుడూ ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్దితి. డ్రగ్స్ వాడకం, బెట్టింగ్ ముఠాతో ఆటగాళ్ళకి లింకులు, మ్యాచ్ ఫిక్షింగ్ ఆరోపణలతో ఎప్పుడూ ఏదో ఒక వివాదం పాకిస్తాని క్రికెట్ ని అంటిపెట్టుకొని యుండడం సాదారణమై పోయింది.  దీనితో సాధారణ అభిమానులు వారి పై అనుమానంగా ఉంటుంటారు. కాని వాస్తవిక దృష్టితో చూస్తే, దానికి చాలా కారణాలు కనబడతాయి. పాకిస్తాన్ దేశములో పాలకుల నిర్లక్షము మరియు యితర కారణాలు మూలంగా ఆ దేశములో చాలా మంది చదువులు మరియు ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉండడం వలన  చట్టవ్యతిరేక కార్యకలాపాల వైపు మళ్ళుతున్నారు. మరియు వారు క్రికెట్ ను అమితంగా అభిమానిస్తారు. దీనినే బెట్టింగ్ మాఫియా ఆదాయ వనరుగా భావించడం వలనే పాకిస్తాన్ క్రికెట్ కి ఈ దుస్దితి దావురించింది.

ఈ బెట్టింగ్ మాఫియాను తక్కువ చేసి చూడడానికి లేదు. ఇక్కడ బెట్టింగ్ మాఫియా అంతర్జాతియ మాఫియాకు అనుసంధానంగా పనిచేస్తుంది. దీనిని నియంత్రించే బలం పాకిస్తాన్ ప్రభుత్వమునకు లేదు. ఎందుకంటే చీకటి సామ్రాజ్యం నుండి వచ్చే నిధులు ప్రభుత్వం చర్యలు తీసుకోలేని విధముగా చేస్తాయి. ఆ కారణంగా బెట్టింగ్ మాఫియా చాలా బలంగా ఉంటుంది. ఈ మాఫియా కొంత మంది క్రికెటర్లులను లొంగదీసుకొని మ్యాచ్ లను ఫిక్స్ చేస్తారు. వాస్తవానికి ఏ ఒక్క పాకిస్తాని క్రికెటర్ కూడా ఈ రొంపిలోకి దిగడానికి ఇష్టపడరు. కాని బెట్టింగ్ మాఫియా వారిని కాని లేక వారి కుటుంబానికి కాని హాని చేయడానికి వెనుకాడదు. అందువలన క్రికెటర్లు కూడా తప్పక ఈ రొంపిలోకి దిగవలసివస్తుంది. ఇన్ని అంతర్గత సమస్యలతో కుదేలవుతున్నప్పటికి పాకిస్తాన్ క్రికెట్ టీమ్ ని తక్కువ చేసి చూసే సాహసం ఏ దేశము కూడా చేయదు. వారిలో సహజసిద్దమైన తెగువ ఉంటుంది. ఆ తెగువే వారిని అజేయులుగా నిలుపుతుంది. ఇక వారి పని ఆయిపోయిందని అనుకొన్న ప్రతిసారి, తమ తడఖా ఏమిటొ చాలా సార్లు చూపించారు. ఈ మధ్య కాలములో పాకిస్తాన్ క్రికెట్ లో చోటుచేసుకొన్న సంఘటనలు వారి అత్మస్దైర్యన్ని దెబ్బతీసేవే ఆయినప్పటికి, తమలో చేవ తగ్గలేదని నిన్న కెన్యాతో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్ లో నిరూపించారు.  ఆ మ్యాచ్ లో వారు ప్రతి విభాగములోను తమ అధిపత్యంను చూపించారు. ఈ విజయం యితర దేశాల గుండెల్లో గుబులు పుట్టించవచ్చు.

శ్రద్దాంజలి (ఐ మిస్ యు బ్రదర్)

ఎందుకో పాత రోజులు చాలా మధురం అని చాలా మంది చెపుతుంటారు....
నీవు తలంపుకు వచ్చినప్పుడల్లా అవెంత నిజమె కదా అనిపిస్తుంది రా....
దేవుడు చాలా గొప్పవాడు అని అంటారు అందరూ....
కాని కొన్ని కొన్ని విషయాల్లో దేవుడు కూడా పొరబాట్లు చేస్తాడు అనిపిస్తుంది రా
నిన్ను చూసినప్పుడు......
నీ సహచర్యంను మర్చిపోలేకపోతున్నా.....
నీ ముఖంపై ఎల్లవేళలా ఉండే స్వచ్చమైన చిరునవ్వును మర్చిపోలేకపోతున్నా......
నీతో కలిసి పంచుకొన్న ప్రతి విషయమును మర్చిపోలేకపోతున్నా......
కాని, నువ్వు ప్రంపంచంలో లేని విషయమును మాత్రం మర్చిపోతున్నాను.......
సరిగ్గా రోజు, సమయానికి నన్ను, ప్రంపంచంను మర్చిపోయిన నిన్ను నేటికి కూడా మర్చిపోలేక.......
(నా ప్రియతమ సోదరుడు, స్నేహితుడు మదన్ మెహన్ రెండు సం.ల క్రితం ఇదే రోజు అనుకోకుండా జరిగిన ప్రమాదంలో దేవుడి దగ్గరకు వెళ్ళిపోయాడు. మమ్మల్లందరిని వదిలేసి శాశ్వతంగా)

డివైడర్స్

కేంద్ర ప్రభుత్వంలో గల కొంత మంది మంత్రుల పనితీరు చూస్తుంటే, వారు మొత్తం దేశానికి ప్రాతినిద్యం వహిస్తున్నరా లేక స్వంత రాష్ట్రానికి ప్రాతినిద్యం వహిస్తున్నరా అనే సందేహం కలుగుతుంది. తాజాగా కేంద్ర రైల్వే మంత్రి మమతా బెనర్జీ వ్యవహర శైలి విధముగానే ఉంది. తాను అవిభక్త భారతదేశానికి కాకుండా కేవలం బెంగాల్ కి మాత్రమే మంత్రిగా పనిచేస్తునట్టున్నారు. ఇందులో ఇంకా బాధపడవలసినది ఏమంటే, సదరు పదవిని స్వంత రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావలన్న ఏకైక ఆశయంతో దుర్వినియెగం చేయడం. ఎవరికైనా తన స్వంత రాష్ట్రం మీద కొద్దిగా అబిమానం ఉంటుంది. దీనిని నేను కాదనను. కాని వారు మొదట తాము భారతదేశానికి ప్రాతినిద్యం వహిస్తున్నము అనే విషయమును గ్రహించాలి. పైగా దానిని తమ స్వార్దరాజకీయ ప్రయెజనాల కోసం ఉపయెగించరాదు. ఇలా సాగితే ఏదొక రోజు ప్రాంతియ ద్వేషాలు తలెత్తి, తమకు ప్రత్యేక సౌత్ భారత దేశము కావలనే డిమాండ్ రావచ్చు. దాని వలన దేశములో అస్దిరత తప్ప ఇంకేమి రాదు.